NBK 111 | బాలయ్య–గోపీచంద్ మలినేని మూవీలో బోల్డ్ భామ… పీరియాడిక్ యాక్షన్ డ్రామాపై పెరిగిన అంచనాలు
NBK 111 | టాలీవుడ్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రేజీ కాంబినేషన్లలో ఒకటైన నందమూరి బాలకృష్ణ – గోపీచంద్ మలినేని జోడీ మరోసారి కలిసి వస్తుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన తాజా అప్డేట్ మరింత హైప్‌ను పెంచుతోంది. ఈ చిత్రంలో బోల్డ్ బ్యూటీ లక్ష్మీ రాయ్ కీలక పాత్రలో నటించనున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
NBK 111 | టాలీవుడ్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రేజీ కాంబినేషన్లలో ఒకటైన నందమూరి బాలకృష్ణ – గోపీచంద్ మలినేని జోడీ మరోసారి కలిసి వస్తుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన తాజా అప్డేట్ మరింత హైప్‌ను పెంచుతోంది. ఈ చిత్రంలో బోల్డ్ బ్యూటీ లక్ష్మీ రాయ్ కీలక పాత్రలో నటించనున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్గా నయనతార ఎంపికైన విషయం తెలిసిందే. ఇప్పుడు లక్ష్మీ రాయ్ చేరికతో సినిమాకు గ్లామర్‌తో పాటు కథలో కొత్త మలుపు వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
తాజా సమాచారం ప్రకారం, లక్ష్మీ రాయ్ పాత్ర సినిమా సెకండ్ హాఫ్‌లో ఎంట్రీ ఇస్తుందని, కథను మలుపుతిప్పేలా బలమైన ప్రాధాన్యతతో ఉండనుందని తెలుస్తోంది. గతంలో ‘అధినాయకుడు’ చిత్రంలో బాలకృష్ణతో కలిసి నటించిన లక్ష్మీ రాయ్, మరోసారి ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోబోతుండటం విశేషం. ఈ సినిమాను నిర్మాత సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. సంగీత బాధ్యతలను ఎస్ థమన్ నిర్వహిస్తున్నారు. ఇక ఈ సినిమా గురించి దర్శకుడు గోపీచంద్ మలినేని సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, “గాడ్ ఆఫ్ మాసెస్ ఈజ్ బ్యాక్… ఈసారి మా గర్జన మరింత గట్టిగా ఉంటుంది” అంటూ భారీ అంచనాలు రేకెత్తించారు.
బాలకృష్ణతో మరోసారి పని చేయడం తనకు ఎంతో సంతోషంగా ఉందని, ఈ చిత్రం చరిత్రలో నిలిచిపోయేలా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. నందమూరి బాలకృష్ణ కెరీర్లో 111వ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న ఈ సినిమా, కథ, టెక్నికల్ వాల్యూస్, స్టార్ కాస్ట్ అన్నీ కలిసి ఒక భారీ విజువల్ ట్రీట్‌గా ఉండబోతుందని టాక్. మొత్తానికి, లక్ష్మీ రాయ్ ఎంట్రీ వార్తతో ఈ ప్రాజెక్ట్‌పై మరింత ఆసక్తి పెరిగింది. ఇప్పుడు అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mouth Cancer | నోటి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే నోటి క్యాన్సర్ వస్తుందా.. ఇతర కారణాలు ఉన్నాయా..?
Assailant | దుండగుడు కూల్‌గా లేడీస్ హాస్టల్లోకి వెళ్లి ఏం చేశాడో తెలుసా..?
CJP Plan B | సీజేపీ ప్లాన్ ‘బి’.. జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అజింక్య షిండే నేతృత్వం
Vijay Deverakonda | ఢిల్లీ హైకోర్టులో విజయ్ దేవరకొండకు ఊరట.. వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ కోర్టు తీర్పు
Nani Movie | గ్యాంగ్‌స్టర్ మోడ్‌లోకి నాని.. సుజీత్ దర్శకత్వంలో ‘బ్లడీ రోమియో’ షూటింగ్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

