టాలీవుడ్ (Tollywood) హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichand Malineni) కాంబోలో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఎన్బీకే 107వ (Nbk107) ప్రాజెక్టుగా వస్తున్న ఈ సినిమా టైటిల్‌ను ఫైనల్ చేశారన్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. బాలకృష్ణను అభిమానులు పిలుచుకునే స్లోగన్‌ను టైటిల్‌గా ఫిక్స్ చేశారట. ఇంతకీ ఆ పేరేంటో ఇప్పటికే అర్థమై ఉంటుంది.
బాలకృష్ణను సిల్వర్ స్క్రీన్‌పై చూసిన వెంటనే మూవీ లవర్స్, అభిమానుల నోట వచ్చే ఒకే ఒక్క మాట జై బాలయ్య. బాలకృష్ణ ఫాలోయింగ్, క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని డైరెక్టర్ జై బాలయ్య పేరును ఎంపిక చేశాడని, దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని టాక్ వినిపిస్తోంది. గతంలో అన్నగారు అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని వార్తలు కూడా వచ్చాయి. అయితే దీని కన్నా జై బాలయ్య అయితే ట్రెండీగా ఉంటుందని అంటున్నారు సినీ జనాలు. అన్నీ కుదిరి ఇదే టైటిల్ ఒకే అయితే నందమూరి అభిమానులకు పండగే అని చెప్పొచ్చు.
పవర్ ఫుల్ మాస్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్ చేస్తోంది. రాయలసీమ నేపథ్యంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రానున్నట్టు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తన్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ యాక్టర్ దునియా విజయ్ (Duniya Vijay) విలన్‌గా నటిస్తున్నాడు.