గత ఏడాది ‘సూక్ష్మదర్శిని’ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించారు మలయాళ నటి నజ్రియా. రీసెంట్గా ప్రకటించిన కేరళ రాష్ట్ర ప్రభుత్వ చలనచిత్ర అవార్డులలో ఆ సినిమాకు గాను ఉత్తమనటిగా అవార్డును కూడా గెలుచుకున్నారామె. ‘సూక్ష్మదర్శని’ తర్వాత నజ్రియా సినిమాలకూ, మీడియాకూ, చివరకు ఫోన్‌కి కూడా దూరంగా ఉన్నారు. దీంతో ఆమెపై మీడియాలో రకరకాల కామెంట్లు వస్తున్నాయి. తన భర్త ఫహాద్ ఫాజిల్‌తో ఆమె విడిపోయారంటూ కథనాలు కూడా వెలువడుతున్నాయి.
ఈ నేపథ్యంలో రీసెంట్గా నజ్రియా ఒక ఎమోషనల్ పోస్ట్‌ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘వ్యక్తిగత కారణాలవల్ల కొంతకాలంగా అందరికీ దూరంగా ఉంటున్నా. నా గురించి తెలుసుకోవడం కోసం ప్రయత్నించిన అందరికీ ధన్యవాదాలు. వాళ్ల ఫోన్లు కూడా నేను లిఫ్ట్ చేయలేదు. చాలామంది నిర్మాతలు నా డేట్స్ కోసం ట్రై చేశారు. నేను స్పందించలేదు. వారందరినీ క్షమించమని వేడుకుంటున్నా. ఇదినాకు కఠినమైన సమయం.
నా 30వ పుట్టినరోజు, న్యూ ఇయర్ వేడుకలు, చివరకు నా సినిమా సక్సెస్మీట్స్కి కూడా దూరంగా ఉన్నా. దానికి బలమైన కారణమే ఉంది. త్వరలోనే కోలుకుని మీ ముందుకు వస్తా.’ అని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు నజ్రియా. ఈ పోస్ట్ చివర్లో తన పేరును ‘నజ్రియా నజీం ఫహాద్’ అని రాయడంతో ఫహాద్‌తో తాను విడిపోతున్నదని వస్తున్న వార్తలన్నింటికీ చెక్ పడినట్టయ్యింది.