Nayanthara | ‘అన్నపూరణి’ స్ట్రీమింగ్ నిలిపివేసిన నెట్‌ఫ్లిక్స్.. నయన్ సినిమాపై వివాదం
లేడీ సూపర్ స్టార్ నయనతార తాజాగా నటించిన చిత్రం ‘అన్నపూరణి’. నయన్ కెరీర్లో 75వ సినిమాగా వచ్చిన ఈ చిత్రానికి నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపకపోయినా ఓటీటీలో ఆదరణ పొందింది.
Nayanthara | లేడీ సూపర్ స్టార్ నయనతార తాజాగా నటించిన చిత్రం ‘అన్నపూరణి’. నయన్ కెరీర్లో 75వ సినిమాగా వచ్చిన ఈ చిత్రానికి నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపకపోయినా ఓటీటీలో ఆదరణ పొందింది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఓ చేదువార్తను తాజాగా ఆ సంస్థ ప్రకటించింది.
ఈ సినిమా స్ట్రీమింగ్‌ను నిలిపివేస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. ఈ చిత్రం శ్రీరాముడిని కించపరిచేలా ఉందంటూ ముంబయి పోలీసులకు ఫిర్యాదు అందింది. శ్రీరాముడు మాంసాహారి అని, ఇది వాల్మీకి అయోధ్య కాండలో ఉంది అంటూ ఈ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ఇటీవల ఈ సినిమా చూసిన మహారాష్ట్రకు చెందిన శివసేన మాజీ నేత రమేశ్ సోలంకి మూవీలోని కొన్ని సన్నివేశాలపై అభ్యంతరం తెలుపుతూ ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
హీరో ముస్లిం అయి ఉండటం, హీరోయిన్ బ్రాహ్మణ కుటుంబానికి చెంది ఉండటంతో లవ్ జీహాద్‌ను ప్రోత్సహించేలా ఉందని, ఈ చిత్ర నిర్మాతలపై చర్యలు తీసుకోవాలని రమేశ్ సోలంకి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదిలావుండగా ఈ సినిమాపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పలు చోట్ల కేసులు కూడా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ‘అన్నపూరణి’ సినిమా స్ట్రీమింగ్‌ను నిలిపివేస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. .
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

