Paiyaa Movie Tamannah | తమిళ నటుడు కార్తీ కెరీర్లో మైలురాయిగా నిలిచిపోయిన చిత్రాలలో అవారా సినిమా ఒకటి. ఈ సినిమాకు పందెంకొడి దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం వహించగా.. తమన్నా కథానాయికగా నటించింది. 2010లో తమిళంలో పయ్యా(Paiyaa).. తెలుగులో అవారా(Awaara) అంటూ వచ్చి బ్లాక్ బస్టర్ అందుకుంది. తమిళంలో కంటే తెలుగులోనే ఈ సినిమా ఎక్కువ కలెక్షన్లు రాబట్టింది. ఇక ఈ సినిమాలో యువన్ శంకర్ రాజా అందించిన పాటలు కూడా చార్ట్ బస్టర్గా నిలిచాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర విషయాన్ని తాజాగా పంచుకున్నాడు దర్శకుడు లింగుస్వామి.
ఒక ఇంటర్వ్యూలో లింగుస్వామి మాట్లాడుతూ.. పయ్యా (అవారా) చిత్రంలో మొదట హీరోయిన్గా నయనతారను అనుకున్నాం. అయితే లాస్ట్ మినిట్లో నాకు నయనతారకి సెట్ కాకపోవడంతో ఇందులోకి తమన్నాని హీరోయిన్గా తీసుకున్నాం. ఈ సినిమా చేసినప్పుడు తమన్నా వయస్సు 19 నుంచి 20 ఏండ్లు ఉండవచ్చు. అలాగే పయ్యా చిత్రం రోడ్ ఫిల్మ్ కావడంతో కారవాన్ తీసుకురాలేదు. అయితే తమన్నా డ్రెస్ మార్చుకోవాలి అనుకున్నప్పుడు సినిమా యూనిట్ వాళ్లే కారును చీరతో కవర్ చేయడం అప్పుడు మార్చుకోవడం చేసేది. సినిమా పట్ల తన అంకితభావం చూసి నేను షాక్ అయ్యాను అంటూ లింగుస్వామి చెప్పుకోచ్చాడు.
“Nayanthara Was Replaced With Tamannah At The Last Moment As #Paiyaa Was A Road Film, There Was No Caravan, Costume Change Was Done With 3 People Covering With Sarees. Still @tamannaahspeaks Did That” – @dirlingusamy ✨
— Analyst (@BoAnalyst) March 8, 2025