Nayanthara Marriage | సినీప్రముఖులు సీక్రెట్‌గా డేటింగ్ చేయడం, కలిసి ట్రిప్స్‌కు వెళ్లడం వంటివి తరచు చూస్తూనే ఉంటాం. ఇప్పటికే సౌత్ టూ నార్త్ వరకు పలువురు సెలబ్రిటీలు సీక్రెట్‌గా డేటింగ్ చేసిన, ట్రిప్స్‌కు వెళ్ళిన ఫోటోలు లీక్ అవ్వడం వంటివి జరిగాయి. ఈ మధ్య కాలంలో కూడా ఓ జంట ఇలానే తమ రిలేషన్‌ను రహస్యంగా మెయింటేన్ చేస్తూ చట్టాపట్టాలేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు.ఆ జంట ఎవరా అనుకుంటున్నారా? వాళ్లు మరెవరో కాదు లేడి సూపర్‌స్టార్ నయన్‌తార, దర్శకుడు విఘ్నేష్ శివన్.
‘నేను రౌడీనే’ షూటింగ్ సమయంలో వీళ్లీద్దరూ ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి ప్రతీ పార్టీలో, సినిమా ఫంక్షన్లో ఇద్దరు కలిసి కనిపించేవారు. మొదట్లో వీళ్లీద్దరూ రిలేషన్‌ను సీక్రెట్‌గా మెయింటేన్ చేసినా తర్వాత ఓపెన్ అయ్యారు. ఇక లక్డౌన్ సమయంలో సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకొని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. తర్వాత పెళ్ళి ఘనంగా ఇరు కుంటుంబ సభ్యుల సమక్షంలో అత్యంత వైభవంగా జరుగుతుందని అంతా భావించారు. కానీ తాజాగా వీళ్ళిద్దరూ నిశ్చితార్థంలాగే పెళ్ళికూడా సీక్రెట్‌గా చేసుకున్నట్లు తెలుస్తుంది. తాజాగా వీళ్ళిద్దరూ కలిసి తమిళనాడులోని ఓ ఆలయానికి వెళ్ళారు. అయితే ఆ ఆలయంలో నయన్‌తార నుదిటిపైన కుంకుమ పెట్టుకుని ఉంది. దాంతో వీళ్ళిద్దరి సీక్రెట్ మ్యారెజ్ బయటపడింది. ప్రస్తుతం వీళ్ళిద్దరి ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ప్రస్తుతం నయన్‌తార, ప్రియుడు విఘ్నేష్ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘కతువాకుల రెండు కాదల్’ సినిమాలో నటిస్తుంది. వీటితో పాటుగా చిరంజీవితో ‘గాడ్‌ఫాదర్’, అట్లి-షారుఖ్‌ఖాన్ ప్రాజెక్ట్‌లతో పాటు రెండు తమిళ సినిమాలు, ఒక మలయాళం సినిమాలో నటిస్తుంది. ఇక విఘ్నేష్ ‘కతువాకుల రెండు కాదల్’ చిత్రానికి దర్శకుడిగానే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు.