లేడి సూపర్ స్టార్ నయనతార కొన్నాళ్లుగా దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ప్రేమాయణం నడుపుతున్న విషయం మనందరకు తెలిసిందే. వీరిద్దరు కలిసి చెట్టాపట్టాలు వేయడం, కలిసి పండుగలు సెలబ్రేట్ చేసుకోవడం, సోషల్ మీడియా ద్వారా ఒకరిపై ఒకరు ప్రేమను కురిపించుకోవడం చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఇద్దరు ప్రేమలో మునిగి తేలుతున్నారు అనే భావన అందరిలో కలుగుతుంది. అయితే ఈ జంట పెళ్లెప్పుడు చేసుకుంటుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
నయనతార, విఘ్నేష్ శివన్ ప్రస్తుతం కలిసి ఉంటున్నారని టాక్. ఈ ఏడాదిలో వారిరివురు ఒక్కటి కానున్నారని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఏప్రిల్ 14న మలయాళం న్యూ ఇయర్ పండుగ విషుని ఘనంగా జరుపుకునేందుకు నయనతార, విఘ్నేష్ శివన్ శనివారం రోజు కొచ్చికు బయలు దేరారు. ఆ సమయంలో తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. విషు పండుగ తర్వాత నయనతార అన్నాత్తె అనే చిత్రంతో పాటు కాతు వాకులా రేండు కాదల్ అనే చిత్ర షూటింగ్స్‌లో పాల్గొననుంది.
#Nayanthara & @VigneshShivN have taken a small break from their hectic schedule and left to Cochin for Malayalam New Year #Vishu
— BA Raju's Team (@baraju_SuperHit) April 10, 2021
After #Vishu break #Nayanthara will be joing the sets of #Annaatthe & #KaathuVaakulaRenduKaadhal pic.twitter.com/tAJ05hR44X