Nayanthara | నయనతార సర్ప్రైజ్ ఎంట్రీ.. స్టేజ్పైనే భావోద్వేగానికి గురైన విఘ్నేష్ శివన్!
Nayanthara | తమిళ స్టార్ హీరోయిన్ నయనతార వ్యక్తిగత జీవితం, సినీ జీవితం రెండింటినీ సమతుల్యం చేస్తూ ముందుకు సాగుతోంది. ఒకవైపు వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే, మరోవైపు తన భర్త విఘ్నేష్ శివన్, ఇద్దరు పిల్లలతో కలిసి ఆనందంగా జీవితాన్ని గడుపుతోంది. ఈ స్టార్ కపుల్ మధ్య ఉన్న బలమైన బంధం తాజాగా మరోసారి అభిమానులను ఆకట్టుకుంది.
Nayanthara | తమిళ స్టార్ హీరోయిన్ నయనతార వ్యక్తిగత జీవితం, సినీ జీవితం రెండింటినీ సమతుల్యం చేస్తూ ముందుకు సాగుతోంది. ఒకవైపు వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే, మరోవైపు తన భర్త విఘ్నేష్ శివన్, ఇద్దరు పిల్లలతో కలిసి ఆనందంగా జీవితాన్ని గడుపుతోంది. ఈ స్టార్ కపుల్ మధ్య ఉన్న బలమైన బంధం తాజాగా మరోసారి అభిమానులను ఆకట్టుకుంది. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథన్, కృతిశెట్టి జంటగా నటించిన “లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ” సినిమా రూపొందింది. ఈ చిత్రాన్ని నయనతార తన బ్యానర్పై నిర్మించడం విశేషం. ఇటీవల ఈ సినిమా తమిళ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది.
ఈ ఈవెంట్లో దర్శకుడు విఘ్నేష్ శివన్ మాట్లాడుతుండగా, అనూహ్యంగా నయనతార స్టేజిపైకి వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె సడన్ ఎంట్రీతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తన భార్యను స్టేజిపై చూసిన విఘ్నేష్ భావోద్వేగానికి గురయ్యాడు. కళ్లలో నీళ్లు తెచ్చుకున్న ఆయనను నయనతార దగ్గరికి వెళ్లి కౌగలించుకొని ఓదార్చింది. ఈ సన్నివేశం అక్కడున్నవారినే కాదు, అందరిని కూడా కదిలించింది. నయనతార తన భర్తకు ఇచ్చిన భావోద్వేగ మద్దతు చూసి ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. “రియల్ లైఫ్లో నిజమైన భాగస్వామ్యం ఇదే” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సినీ తారల జీవితాల్లో కూడా ఇలాంటి నిజమైన భావోద్వేగ క్షణాలు ఉంటాయని ఈ సంఘటన మరోసారి నిరూపించింది. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి జంటగా రూపొందిన చిత్రం ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏప్రిల్ 10న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కాబోతోంది. ప్రమోషన్స్ లో భాగంగా ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న విఘ్నేష్.. ధనుష్ గురించి మాట్లాడుతూ..’ధనుష్ సార్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన్ని ఎప్పుడూ గొప్పగానే చూస్తాను. జులై 28 ఆయన బర్త్ డే. అది మా మా నాన్న చనిపోయిన రోజు. దాని వల్ల ధనుష్ లో నేను నా తండ్రిని చూసుకున్నట్లు ఫీల్ అవుతాను. ఆయన మీద అంత ప్రేమ ఉంది” అని అన్నారు.
#LIK -;#Nayanthara appears for an Audio Launch function, after a long time, just because for #VigneshShivan ❤️ pic.twitter.com/R6cdrCWE3J
— AmuthaBharathi (@CinemaWithAB) April 7, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

