కోలీవుడ్ క్యూట్ కపుల్ నయనతార- విఘ్నేష్ శివన్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న విషయం తెలిసిందే. ఈ జంటకు సంబంధించిన వార్తలు నిత్యం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంటాయి. తాజాగా నయన్ ప్రియుడు, దర్శకుడు విఘ్నేష్ శివన్ ఆమె పుట్టిన రోజు వేడుకలను గ్రాండ్‌గా ప్లాన్ చేశాడు. ఇందులో భాగంగా బుధవారం అర్ధరాత్రే కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు.
సమంత కూడా ఈ పార్టీలో సందడి చేసింది. అయితే నయన్‌ని ప్రేమగా హత్తుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండగా, ఇది చూసి అభిమానులు మురిసిపోతున్నారు. విఘ్నేష్ దర్శకత్వంలో నయనతార, సమంత, విజయ్‌సేతుపతి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘కాత్తు వాక్కుల రెండు కాదల్’. కాగా నయన్ పుట్టిన రోజును పురస్కరించుకుని చిత్ర బృందం సినిమాలో ఆమె పోషించిన ‘కణ్మణి’ పాత్ర పోస్టర్‌ను విడుదల చేశారు.
ఇదిలా ఉంటే వీరి పెళ్లి విషయానికి వస్తే నయనతార జాతకంలో చిన్నపాటి దోషం ఉన్నట్టు పండితులు చెబుతున్నారు. దోష నివారణకు నయనతార ముందుగా ఓ చెట్టును పెళ్లాడిన తర్వాత విఘ్నేష్ శివన్‌ను వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. 2022వ సంవత్సరం ప్రథమార్థంలో వీరి పెళ్లి జరగడం ఖాయం అంటున్నారు కొంత మంది సన్నిహితులు. నయనతార, విఘ్నేష్ శివన్‌కు ఇప్పటికే ఎంగేజ్మెంట్ కూడా జరిగింది.
Birthday Bash 🌟🎉 #VikkyNayan pic.twitter.com/UtTqX6bJtx
— Nayanthara✨ (@NayantharaU) November 17, 2021