అశ్విన్ శరవనన్ (Ashwin Saravanan) దర్శకత్వంలో లేడీ సూపర్‌స్టార్ నయనతార (Nayanthara) నటిస్తోన్న సినిమా కనెక్ట్ (Connect). ముందుగా ఇచ్చిన అప్డేట్ ప్రకారం నయనతార పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ కనెక్ట్ టీజర్‌ను విడుదల చేశారు.
నయనతార తన గదిలో భయంభయంగా కనిపిస్తుండగా.. గుర్తు తెలియని వ్యక్తి డోర్‌ను కొడుతున్నాడు. బ్యాక్ డ్రాప్లో భయంతో కూడిన అరుపులు, కేకలు వినిపిస్తున్నాయి. ఇంకో రూం తలుపు తెరవగా.. బెడ్‌పై షాక్ లుక్‌లో ఉన్న యువతి కనిపిస్తుంది. టీజర్లోనే సస్పెన్స్ క్రియేట్ చేస్తూ.. అసలేం జరుగుతోందని ఆలోచింపజేస్తూ.. హార్రర్ థ్రిల్లర్స్ ను ఇష్టపడే మూవీ లవర్స్ లో సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాడు డైరెక్టర్.
ఈ చిత్రంలో బాలీవుడ్ దర్శకనిర్మాత, నటుడు అనుపమ్ ఖేర్‌తోపాటు సత్యరాజ్, వినయ్ రాయ్, హనియ నఫిస కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హార్రర్ థ్రిల్లర్ జోనర్లో వస్తున్న ఈ చిత్రాన్ని రౌడీ పిక్చర్స్ బ్యానర్‌పై నయనతార భర్త విఘ్నేశ్ శివన్ తెరకెక్కిస్తుండగా.. పృథ్వి చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు.
నయనతార కనెక్ట్ టీజర్.. వీడియో
‘The Devil doesn’t leave quietly’
In theatres 22.12.2022
Presenting the official Teaser of #Connect starring Lady Superstar #Nayanthara ⭐
▶️ https://t.co/GdZTb8mC5o@VigneshShivn @AnupamPKher #Sathyaraj #VinayRai @haniyanafisa @Ashwin_saravana pic.twitter.com/ENk56OdsSV
— Rowdy Pictures (@Rowdy_Pictures) November 18, 2022