Nayanthara | ‘లేడీ సూపర్ స్టార్’ నయనతార తన భర్త విఘ్నేశ్ శివన్‌తో విడాకులు తీసుకోబోతుందని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తలకు చెక్ పెడుతూ తన భర్తతో అన్యోన్యంగా ఉన్న ఫొటోను షేర్ చేసింది.
నయనతార ఇటీవల తన సోషల్ మీడియా స్టోరీస్‌లో ఒక పోస్ట్ షేర్ చేసింది. అందులో.. తెలివి తక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పుడు, మ్యారేజ్ అనేది పెద్ద మిస్టేక్. నీ భర్త చేసే పనులకు నువ్వు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పురుషులు సాధారణంగా మెచ్యూర్ కాదు. నన్ను ఒంటరిగా వదిలేయండి. నేను ఆల్రెడీ చాలా మీవల్ల ఫేస్ చేశా అంటూ రాసుకోచ్చింది. అయితే ఈ పోస్టును నయన్ కొద్దిసేపటికే డిలీట్ చేసినప్పటికీ, అప్పటికే స్క్రీన్షాట్ల రూపంలో వైరల్ అయి, నయనతార-విఘ్నేష్ శివన్ మధ్య విభేదాలు తలెత్తాయని, విడాకులు తీసుకోబోతున్నారనే ప్రచారానికి దారితీసింది.
ఈ వార్తలు వైరలయ్యిన వెంటనే, నయనతార తన భర్త విఘ్నేష్ శివన్, పిల్లలతో కలిసి పళని సుబ్రహ్మణ్యస్వామి ఆలయాన్ని సందర్శించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆలయంలో దంపతులిద్దరూ కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి, సాష్టాంగ నమస్కారాలు చేశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, వారి మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని, విడాకుల వార్తలు అవాస్తవమని స్పష్టమైంది.
అయితే తాజాగా తన విడాకుల వార్తలపై మరోసారి స్పందించింది నయనతార.. తాజాగా నయన్ తన సోషల్ మీడియాలో విఘ్నేష్ శివన్ నేలపై పడుకుని ఉండగా, ఆయనపై ఎక్కి కూర్చున్న ఒక ఫోటోను షేర్ చేస్తూ, “మా గురించి కొన్ని పనికిమాలిన వార్తలు చూస్తున్నప్పుడు మా రియాక్షన్ ఇలాగే ఉంటుంది” అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
😬😍 #WikkiNayan pic.twitter.com/S8FtozvupS
— Nayanthara✨ (@NayantharaU) July 10, 2025