Nayanthara | లేడి సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ అమ్మడికి తెలుగులోను, కోలీవుడ్లోను మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. హీరోలకి ధీటుగా పారితోషికం అందుకుంటుంది నయనతారు. మరోవైపు సినిమా ప్రమోషన్స్‌లో పెద్దగా పాల్గొనదు. ఈ మధ్య నయనతార సీనియర్ హీరోల సరసన నటిస్తుంది. పారితోషికం విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కాని నయనతార ఇప్పుడు చిరంజీవి కోసం ఓ మెట్టు దిగిందని అంటున్నారు. త్వరలో మెగాస్టార్ చిరంజీవి.. అనీల్ రావిపూడి దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నాడు. సంక్రాంతికి వస్తున్నాం వంటి భారీ కమర్షియల్ సక్సెస్ తర్వాత అనీల్ రావిపూడి చేస్తున్న చిత్రమిది.
ఈ చిత్రంలో కథానాయికగా లేడి సూపర్ స్టార్ నయనతారని ఎంపిక చేశారు. అయితే సినిమాకు సంతకం చేసేటప్పుడు కొన్ని కండిషన్స్ పెట్టే అలవాటు నయనతారకు ఉంది. అందులో ముఖ్యమైనది పబ్లిసిటీ ప్రోగ్రామ్స్, ఇంటర్వ్యూలు వంటివి తనకు కుదరవని చెబుతుంది. కాని చిరంజీవి సినిమా కోసం ఓ మెట్టు దిగి ప్రమోషన్లో పాల్గొననుందని అంటున్నారు. ఇటీవల చెన్నై వెళ్లిన అనిల్ రావిపూడి… నయన్ మీద స్పెషల్ వీడియో షూట్ చేసి వచ్చారు. దీనిని బట్టి ఆమె సినిమా ప్రచార కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉందని అంటున్నారు.
ఇక మరో విషయం ఏంటంటే చిరంజీవి – అనిల్ రావిపూడి సినిమా కోసం నయనతార 18 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందని ఆ మధ్య ప్రచారం జరిగింది. సౌత్ సినిమా ఇండస్ట్రీలో 10 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్గా నయన్ రికార్డ్ క్రియేట్ చేశారు. అయితే ఇప్పుడు చిరంజీవి సినిమా కోసం నయనతార కేవలం 6 కోట్ల రూపాయలు తీసుకోవడానికి సిద్ధమైందట. చిరు సినిమా కోసం ఆవిడ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించడం చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు. ఇక నయనతార నటించిన చివరి తెలుగు సినిమా గాడ్ ఫాదర్ కాగా, అందులో ఆవిడ సిస్టర్ రోల్ చేశారు. అంతకు ముందు హిస్టారికల్ వార్ డ్రామా ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో హీరోయిన్ రోల్ చేశారు.