Nayanthara | తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న భామల్లో టాప్‌లో ఉంటుంది నయనతార (Nayanthara). డెబ్యూ డైరెక్టర్ సెంథిల్ నల్లసామి దర్శకత్వంలో నయనతార నటిస్తోన్న తాజా చిత్రం Rakkayie. నయనతారకు బర్త్ డే విషెస్ తెలియజేస్తూ ఈ మూవీ టైటిల్ టీజర్‌ను విడుదల చేశారు.
నయనతార ఏడుస్తున్న పిల్లవాడికి పాలు తాగించి.. మరోవైపు వీరనారిగా రెండు చేతుల్లో ఆయుధాలు పట్టి సమరంలో పాల్గొంటున్న విజువల్స్ గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి. పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీని డ్రమ్ స్టిక్స్ ప్రొడక్షన్స్, మూవీ వెర్సె ఇండియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గోవింద్ వసంత సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే షూటింగ్, ఇతర వివరాలపై క్లారిటీ రానుంది.
Rakkayie టైటిల్ టీజర్..
NAYANTHARA’S ACTION-DRAMA ‘RAKKAYIE’ TITLE TEASER UNVEILS ON HER BIRTHDAY… On the occasion of #Nayanthara‘s birthday, #DrumsticksProductions and #MovieVerseStudios unveil the title teaser of period-action drama #Rakkayie, a PAN-India film.
Directed… pic.twitter.com/eguMy9aL73
— taran adarsh (@taran_adarsh) November 18, 2024
Kannappa | మహదేవ్ శాస్త్రిగా మోహన్ బాబు.. కన్నప్ప ప్రీ లుక్ వైరల్
Pushpa 2 The Rule trailer | ఎవడ్రా వాడు.. డబ్బంటే లెక్కలేదు.. అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్ ట్రైలర్
Kantara Chapter 1 | అఫీషియల్.. రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ -1 రిలీజ్ డేట్ వచ్చేసింది
Akira Nandan | ఓజీతోనే అకీరానందన్ ఎంట్రీ.. ఎస్ థమన్ క్లారిటీ ఇచ్చేసినట్టే..!