మాలీవుడ్ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran), కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార (Nayanthara) కాంబినేషన్లో గోల్డ్ (Gold) సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ప్రేమమ్ ఫేం అల్ఫోన్స్ పుత్రేన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం ముందుగా నిర్ణయించిన ప్రకారం సెప్టెంబర్ 15న విడుదల కావాల్సింది.. కానీ వాయిదా పడ్డది. చాలా రోజుల తర్వాత రిలీజ్ డేట్పై ఓ వార్త నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
ఈ చిత్రాన్ని డిసెంబర్ 2న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని తాజా టాక్. అయితే దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అజ్మల్ అమీర్, కృష్ణ శంకర్, శబరీశ్ వర్మ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం కామెడీ డ్రామాగా తెరకెక్కుతోంది. పృథ్విరాజ్ ప్రొడక్షన్స్ అండ్ మ్యాజిక్ ఫ్రేమ్స్ బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రాజేశ్ మురుగేశన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
పృథ్విరాజ్ సుకుమారన్ సినిమాలకు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంటుందని తెలిసిందే. నయనతార సినిమాల గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మలయాళం, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా మరి తెలుగులో ఎప్పుడొస్తుందనేది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.