Jawan Movie | ఐదేళ్ల గ్యాప్ తర్వాత పఠాన్‌తో వీర లెవల్ కంబ్యాక్ ఇచ్చిన షారుఖ్.. ప్రస్తుతం అదే జోష్‌తో జవాన్‌తో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. పోస్టర్లు, గ్లింప్స్‌తో ఒక రకమైన క్యూరియాసిటీ పంచేసిన ఈ సినిమా.. ఇరవై నాలుగ్గంటల ముందు రిలీజైన ట్రైలర్‌తో ఊహించిన రేంజ్లో ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. మునుపెన్నడూ షారుఖ్‌ను ఆ రేంజ్ యాక్షన్మోడ్లో చూడలేదని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలే అంటున్నాయి. ఇక ఫ్యాన్స్ అయితే అట్లీ కనిపిస్తే పూజలు, పురస్కారాలు చేస్తారెమో అనిపిస్తుంది వాళ్ల సంబురాలు చూస్తుంటే. ట్రైలర్ చూస్తుంటే బీ,సీ సెంటర్లు మార్మొగిపోతాయని స్పష్టం అయిపోయింది.
ఇక ఈ సినిమాలో లేడి సూపర్‌స్టార్ నయనతార ఫీమేల్ లీడ్ పోషిస్తుంది. ట్రైలర్లో నయన్‌ను ఒక్క షాట్‌లోనే చూపించినా.. ఆ షాట్ తాలుకూ ఇంపాక్ట్ బాగానే కనిపించింది. నయన్ ఫ్యాన్స్ ఒకింత కాస్త నిరాశలో ఉన్నా.. ఆమె పాత్ర వీర లెవల్లో ఉండబోతుందని ఆ ఒక్క షాట్‌తో స్పష్టమయిపోయింది. ఇక తాజాగా యాక్షన్ మోడ్‌లో ఉన్న నయనతార పిక్‌ను చిత్రబృందం రిలీజ్ చేసింది. చేతిలో గన్ పట్టుకుని అగ్రెసీవ్‌గా ఉన్న నయన్ పిక్ అదిరిపోయింది.
రెడ్ చిల్లీ ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసుకునే పనిలో పడింది. హిందీతో పాటు పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా సెప్టెంబర్ 7న రిలీజ్ కానుంది. అనురుధ్ రవిచంద్రన్ స్వరాలు అందిస్తున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి ప్రతినాయకుడి పాత్ర పోషించాడు.
Fear has no hold on her! 💥#Nayanthara #JawanPrevue Out Now – https://t.co/CUWX1S7sQ4#Jawan releasing worldwide on 7th September 2023, in Hindi, Tamil & Telugu. pic.twitter.com/h6hw4ppHig
— Red Chillies Entertainment (@RedChilliesEnt) July 17, 2023