నయనతార కెరీర్ను పరిశీలించే వారికి ఆమె సినిమాల ప్రచార కార్యక్రమాలకు హాజరుకాదని తెలుసు. గతంలో ఆమె గురించి ఏదో మీడియాలో వచ్చిన వార్తలకు బాధపడిన నయనతార మీడియా ముందుకు రావొద్దని నిర్ణయించుకుంది. అలా ఎంత పెద్ద స్టార్ సరసన, ఏ స్థాయి భారీ చిత్రంలో ఆమె నటించినా ఆ సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేది కాదు. దీనిపై ఆమెతో సినిమాలు చేస్తున్న నిర్మాతలతో సహా నయనతార సినిమాలు కొనుక్కున్న డబ్బింగ్ నిర్మాతలు కూడా బహిరంగ వేదికల మీదే విమర్శలు చేశారు. అయినా ఆమె తన మనసు మార్చుకోలేదు. ఇటీవల నిర్మాతగా మారిన నయనతారకు ప్రొడక్షన్ కష్టాలు తెలిసినట్లున్నాయి. అందుకే తను నిర్మాతగా రూపొందించిన ‘కనెక్ట్’ అనే కొత్త సినిమా కోసం ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నది. ఇంటర్వ్యూలు ఇస్తున్నది. సొంత సినిమా కాబట్టే నయనతార ప్రచార కార్యక్రమాలను చేస్తున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి.