రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా తమిళ చిత్రం ‘అన్నాత్తే’. గ్రామీణ నేపథ్య కథాంశంతో ఫ్యామిలీయాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో సాగుతోంది. కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని తగిన జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ చేస్తున్నారు. తాజాగా నయనతార చిత్రయూనిట్లో భాగమైంది. ఈ సినిమా చిత్రీకరణ కోసం మంగళవారం ఆమె హైదరాబాద్‌కు విచ్చేసింది.ఇటీవలే ప్రియుడు విఘ్నేష్ శివన్‌తో కలిసి కొచ్చికి విహారయాత్రకు వెళ్లిన నయనతార టూర్ ముగించుకొని నేరుగా షూటింగ్ కోసం భాగ్యనగరానికి వచ్చినట్లు సమాచారం. బుధవారం నుంచి రజనీకాంత్, నయనతారలపై కీలక ఘట్టాలతో సహా ఓ పాటను తెరకెక్కించేందుకు దర్శకుడు శివ సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.