కొన్ని రోజుల ముందు వరకు అభిమానులని సస్పెన్స్‌లో పెట్టిన నయనతార- విఘ్నేష్ శివన్ జంట ఎట్టకేలకు తమ రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయింది. ఐదేళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్న లవ్‌బర్డ్స్ నయనతార, విఘ్నేశ్ శివన్‌లు ఇటీవల సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఓ టీవీ షోకు హజరైన నయన్ వెల్లడించింది. లాక్డౌన్లో కొద్దిమంది కుటుంబ సభ్యులు మధ్య ఎంగేజ్మెంట్ వేడుక జరిగినట్లు తెలిపింది.
పెళ్లి వేడుక కూడా అతి త్వరలో జరగనుందని తెలియజేసిన నయనతార ..ఈ విషయంలో ఎలాంటి దాపరికం లేకుండా అందరిని ఆహ్వానిస్తానని చెప్పుకొచ్చింది . అయితే విఘ్నేష్ శివన్.. నయన్‌ని ఇంకా పెళ్లి కాకున్నా వాళ్ళ ఇంటికి అల్లుడిగా చలామణి అవుతున్నాడు. తాజాగా నయనతార తల్లి బర్త్ డే వేడుకలో స్పెషల్ అట్రాక్షన్‌గా మారాడు.
నయనతార తల్లి ఓమన కురియన్ బర్త్ డేను వీరిద్దరూ కలిసి సెలెబ్రేట్ చేశారు. ఆమెతో కేక్ కట్ చేయించడంతో పాటు పూల గుచ్చాలు, బహుమతులు అందించి, ఆమెను సంతోష పరిచారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 2015లో విఘ్నేష్ దర్వకత్వం వహించిన ‘నానుమ్ రౌడీ దాన్’ అనే సినిమాలో నయనతార హీరోయిన్గా నటించింది. ఈ సినిమా సెట్స్ నుంచే వీళ్ల ప్రేమ మొదలైందని చెప్పచ్చు. అప్పట్నుంచి వీరిరివురు గాఢమైన ప్రేమలో మునిగిపోయారు.
Today #Nayanthara’s mom Omana Kurian is celebrating her birthday. Here’s wishing her good health and happiness always 🙏🎂🎈 pic.twitter.com/XQq4gl0ftO
— sridevi sreedhar (@sridevisreedhar) September 15, 2021