Toxic: A Fairy Tale For Grown-Ups | ‘KGF’ సిరీస్ వంటి మెగా బ్లాక్‌బస్టర్ తర్వాత కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ (Toxic: A Fairy Tale For Grown-Ups) (Toxic). నేషనల్ అవార్డు విన్నర్ గీతూ మోహన్ దాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి కియారా ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన చిత్రబృందం తాజాగా నయనతార ఫస్ట్‌లుక్‌ను వదిలింది. ఈ సినిమాలో నయనతార గంగా అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. తాజాగా విడుదలైన పోస్టర్లో నయనతార లుక్ చాలా ఇంటెన్సివ్‌గా ఉంది. యష్ సరసన నయనతార నటిస్తుండటం ఇదే మొదటిసారి కావడంతో ఈ కాంబినేషన్ పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది.
KGF 2 వంటి భారీ విజయం తర్వాత యష్ నటిస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ చిత్రాన్ని 2026 మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఉగాది, గుడి పడ్వా మరియు ఈద్ పండుగల సెలవులను క్యాష్ చేసుకునేలా ఈ డేట్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది.
మరోవైపు ఈ సినిమాను ఇంగ్లీష్, కన్నడ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరిస్తున్నారు. వీటితో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం వంటి పలు భారతీయ భాషల్లో డబ్ చేసి విడుదల చేయనున్నారు. కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ మరియు మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై వెంకట్ కె. నారాయణ, యష్ సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Introducing Nayanthara as GANGA in – A Toxic Fairy Tale For Grown-Ups #TOXIC #TOXICTheMovie
@advani_kiara @humasqureshi #GeetuMohandas @RaviBasrur #RajeevRavi #UjwalKulkarni #TPAbid #MohanBKere #SandeepSadashiva #PrashantDileepHardikar #KunalSharma #SandeepSharma #JJPerry… pic.twitter.com/FSiWGo7XeC
— Yash (@TheNameIsYash) December 31, 2025