ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నట్టు హీరోయిన్లపై వస్తున్న వార్తలపై ఇటీవల ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నయనతార స్పందించింది. ‘పనిలేనివాళ్లు సృష్టించే చెత్త ఇదంతా. గతంలో నాపై కూడా ఇలాంటి రూమర్లు వచ్చాయి. ముఖంలో కాస్త మార్పు కనిపిస్తే ప్లాస్టిక్ సర్జరీ అనేస్తారు. మేకప్ గురించి అవగాహన ఉన్నవాళ్లయితే ఇలాంటివి రాయరు. నా కనుబొమ్మలంటే నాకు చాలా ఇష్టం. సందర్భాన్ని బట్టి వాటి ఆకారం మారుస్తుంటాను. వాటికోసం ఎంతో సమయాన్ని వెచ్చిస్తుంటా. కనుబొమ్మల ఆకారం మారినప్పుడల్లా ముఖంలో మార్పు కనిపిస్తుంది. అది చూసి ప్లాస్టిక్ సర్జరీ అనేస్తారు. నిజానికి ముఖంలో మార్పులు రావడానికి చాలా కారణాలు ఉంటాయి. ఒక్కోసారి డైటింగ్ వల్ల బుగ్గలు లోపలికి వెళ్లినట్టు కనిపిస్తాయి. రెండుమూడురోజులు రెస్ట్ తీసుకొని బయటకొస్తే బుగ్గలు పెరిగినట్టు కనిపిస్తాయి. వాటికి కూడా ప్లాస్టిక్ సర్జరీ అనేస్తే ఎలా? కావాలంటే నన్ను గిచ్చి చూసుకోవచ్చు. నా శరీరంలో ఎక్కడా ప్లాస్టిక్ ఉండదు’ అంటూ అందంగా నవ్వేసింది నయనతార.