అన్యోన్య దాంపత్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు కోలీవుడ్ క్యూట్ కపుల్ నయనతార, విఘ్నేష్. ఈ జంట దంపతులై సోమవారానికి మూడేళ్లు. ఈ సందర్భంగా నయనతార షేర్ చేసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ రేంజ్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలతోపాటు తన భర్తకు ఓ అద్భుతమైన ప్రేమలేఖను కూడా రాసేశారు నయనతార. ‘ఒకరిపై ఒకరు ఇంతలా ఎలా ప్రేమ చూపుతారనేది ఎప్పటికీ సమాధానం దొరకని ప్రశ్నే అనుకున్నాను.
కానీ.. నీ రూపంలో దానికి సమాధానం దొరికింది. వర్ణించడానికి అలవికానిది నీ ప్రేమ. నా మనసు కోరుకునే ప్రేమవు నువ్వు. ఇద్దరిగా మొదలైన మన ప్రయాణం నలుగురిగా మారింది. కోరుకోవడానికి ఇంతకు మించి ఏముంటుంది? స్వచ్ఛమైన ప్రేమను పంచుతున్న నా జీవిత భాగస్వామికి పెళ్లిరోజు శుభాకాంక్షలు.’ అని పొయెటిగ్గా విష్ చేశారు నయనతారు. ఈ పోస్ట్ చూసిన వారంతా ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.