సంక్రాంతి ఎప్పుడొస్తుందా.. ‘మన శంకర వరప్రసాద్‌గారు’ తెరపైకి ఎప్పుడొస్తారా.. అని తెలుగు రాష్ట్రాల్లోని మెగా అభిమానులంతా కళ్లల్లో ఒత్తులు పెట్టుకొని మరీ ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ వచ్చేసింది. ‘మన శంకర వరప్రసాద్‌గారు’ తెరపైకి రావడానికి నెల రోజులే ఉంది. అందుకే.. ఫ్యాన్స్‌ని అలర్ట్ చేసేందుకు సెకండ్ సింగిల్‌ని కూడా విడుదల చేసేందుకు రెడీ అయ్యారు చిత్రబృందం. ఈ నెల 6న ఈ పాటను విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ పోస్టర్ని కూడా విడుదల చేశారు.
‘శశిరేఖ..’ అంటూ సాగే ఈ పాట మంచి బీట్తో మరో మెలోడియస్ ట్రాక్ అవుతుందని మేకర్స్ హామీ ఇస్తున్నారు. ఇక పోస్టర్ని గమనిస్తే.. అద్భుతమైన ఎనర్జీతో నిండిన మెగాస్టార్ డ్యాన్స్ మూమెంట్.. పక్కనే ైస్టెలిష్‌గా నయనతార డ్యాన్స్ పోజ్ ఆడియన్స్‌లో ఓ వైబ్‌ను క్రియేట్ చేసేలా ఉంది. ఈ సినిమా షూటింగ్ కూడా చివరి దశకు చేరుకున్నది. ఈ చిత్రానికి కెమెరా సమీర్‌రెడ్డి, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, సమర్పణ: శ్రీమతి అర్చన, నిర్మాతలు : సాహు గారపాటి, సుస్మిత కొణిదెల, నిర్మాణం: షైన్ స్క్రీన్స్ అండ్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్, దర్శకత్వం: అనిల్ రావిపూడి.