లేడీ సూపర్‌స్టార్‌గా నయనతారకు అభిమానులు కోట్లల్లో ఉంటారు. అంతమందికి అభిమాన తార అయిన నయన్ ఎవరి అభిమాని అయ్యుంటుంది? ఈ విషయాన్ని నయనతార కూడా ఎప్పుడూ ఎక్కడా చెప్పలేదు. రీసెంట్గా తన అభిమాన తార గురించి చెప్పుకొచ్చింది నయనతార. తనెవరో కాదు.. మలయాళ నటి ‘మీరాజాస్మిన్’. అసలు తను మీరాజాస్మిన్‌కు ఎలా అభిమాని అయ్యిందో నయన్ చెబుతూ ‘మా ఇద్దరిదీ ఒకే ఊరు. కేరళ దగ్గర తిరువళ్ల. మీరాజాస్మిన్ కజిన్‌తో కలిసి చదువుకున్నాను.
ఆమె ద్వారానే మీరా గురించి తెలుసుకున్నా. తను ఫారిన్ షూటింగ్‌కు వెళ్లిందనీ, తను ఆ సినిమాలో అలా నటించిందనీ, ఇలా డాన్స్ చేసిందని తను చెబుతుంటే తెలీకుండానే మీరాజాస్మిన్‌కు అభిమానిని అయిపోయా. హీరోయిన్ అవ్వాలనే కోరిక కూడా నాకు మీరాజాస్మిన్ని చూశాకే కలిగింది. అయితే.. నేను హీరోయిన్ అయి ఇరవై ఏళ్లు దాటింది.
ఇన్నాళ్లల్లో ఎప్పుడూ ఆమెతో కలిసి నటించే అవకాశం రాలేదు. నా తాజా సినిమా ‘టెస్ట్’ ద్వారా ఆమెతో స్క్రీన్ షేర్ చేసుకోవడం జరిగింది. తనతో మాట్లాడటం కూడా ఇదే తొలిసారి.’ అంటూ ఆనందం వెలిబుచ్చింది నయనతార.