Nayanathara | లేడి సూపర్ స్టార్ నయనతార తమిళ అగ్ర కథానాయకుడు ధనుష్‌పై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. నయనతారపై నెట్‌ఫ్లిక్స్ ఒక డాక్యుమెంటరీని తీస్తున్న విషయం తెలిసిందే. ఈ డాక్యుమెంటరీలో తాను నటించిన నానుమ్ రౌడీ దాన్ సినిమాలో నుంచి 3 సెకన్ల వీడియోను తన డాక్యుమెంటరీ కోసం వాడుకుంది. అయితే ఈ 3 సెకన్ల వీడియో వాడుకోవడంపై చిత్ర నిర్మాత ధనుష్ నయనతారకు లీగల్ నోటీసులు పంపించడమే కాకుండా రూ.10 కోట్లు డిమాండ్ చేశాడు. దీంతో ఈ వివాదంపై విసిగిపోయిన నయనతార సోషల్ మీడియా వేదికగా ధనుష్‌పై విమర్శులు కురిపిస్తూ.. బహిరంగ లేఖను విడుదల చేసింది. కాగా ఇందుకు సంబంధించిన నోట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ఇదిలావుంటే నయనతారను ధనుష్ రూ.10 కోట్లు డిమాండ్ చేసిన ఆ 3 సెకన్ల వీడియో ప్రస్తుతం ఎక్స్‌లో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. కేవలం 3 సెకన్ల వీడియోకు రూ.10 కోట్లా అంటూ ధనుష్‌ని ట్రోల్ చేస్తున్నారు. ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.
NOC on 3sec video recorded on personal video is crazy 😭😭😭🤣🤣 ithukku muttu vera pic.twitter.com/IWU32E0xUs
— katsu curry (@kattberrie) November 16, 2024
నయనతార, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం నానుమ్ రౌడీ దాన్. ఈ సినిమాకు నయనతార భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించగా.. వండర్ బేర్స్ బ్యానర్‌పై ధనుష్ ఈ సినిమాను నిర్మించాడు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ సినిమాలోని సాంగ్స్ ఎంత పెద్ద హిట్ అయ్యయ్యో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే రీసెంట్గా నయనతారపై నెట్‌ఫ్లిక్స్ ఒక డాక్యుమెంటరీని విడుదల చేసింది. దీనికి సంబంధించిన ప్రోమోలో నానుమ్ రౌడీ దాన్ సినిమాలోని క్లిప్‌లను నయనతార వాడుకున్నందుకు ధనుష్ నయనతారకు నోటీసులు పంపినట్లు తెలుస్తుంది. అంతేగాకుండా రూ.10 కోట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం.