దాదాపు ఐదేళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్న నయనతార- విఘ్నేష్ శిన్ జంట ఎప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటారు. పెళ్లి కాలేదనే కాని వీరిద్దరు చెట్టాపట్టాలు వేసుకోవడం, కలిసి పండుగలు, పార్టీలు జరుపుకోవడం, ఒకరి ఇంట్లో ఫంక్షన్‌కి మరొకరు వెళ్లడం చేస్తూ వస్తున్నారు. రీసెంట్గా విఘ్నేష్ శివన్.. నయన తార తల్లి బర్త్‌డేని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయగా, అందుకు సంబంధించిన పిక్స్ వైరల్‌గా మారాయి.
శనివారం విఘ్నేశ్ 36వ పుట్టినరోజు సందర్భంగా సర్ప్రైజ్ పార్టీతో ఆశ్చర్యపరిచింది నయనతార. నయన్ ఇచ్చిన సర్‌ప్రైజ్‌కి సంబంధించిన ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసిన విఘ్నేష్ శివన్.. నీ ఉనికి నా జీవితంలో ఏ బహుమతితో పోల్చలేనిది. థ్యాంక్యూ థంగమే..నా బర్త్‌డేను మరింత స్పెషల్‌గా మార్చినందుకు అంటూ నయన్‌పై ప్రేమ కురిపించాడు.
నయనతార, సమంత, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలలో విఘ్నేష్ శివన్ కాత్తు వాక్కుల రెండు కాదల్ చిత్రం తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం మరి కొద్ది రోజులలో విడుదల కానుంది.ఇక నయన్- విఘ్నేశ్ కొద్ది రోజుల క్రితం నిశ్చితార్థం చేసుకోగా, అతి త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు.