లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ వయస్సులోను అందం, అభినయంతో ఆకట్టుకుంటూ ఉంటుంది. తెలుగు, తమిళ ప్రేక్షకులకి చాలా సుపరిచితంం అయిన నయనతార చెన్నైలోని పొయెస్ గార్డెన్లో నాలుగు పడక గదుల ఇంటిని కొనుగోలు చేసిందని సమాచారం. పెళ్లి తర్వాత కాబోయే భర్త విఘ్నేష్ శివన్ తో కలిసి ఆ ఇంట్లోకి మారనుందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత, రజనీకాంత్‌ల నివాసాలు ఈ పొయెస్ గార్డెన్‌లోనే ఉన్నాయి.
రజనీ కాంత్ ఇంటిపక్కనే ధనుష్ తన డ్రీమ్ హౌజ్‌ను నిర్మిస్తున్నాడు. అయితే నయనతార ఈ పోయేస్ గార్డెన్లో ఇల్లు కొనగోలు చేసేందుకు భారీగానే ఖర్చు చేస్తుందట. తన కన్న కలను నెరవేర్చుకునే సమయం దగ్గర పడిందని తన సన్నిహితులతో చెప్పుకొచ్చిందట నయనతార. వచ్చే ఏడాది ఈ అమ్మడు పెళ్లి పీటలు ఎక్కనున్నట్టు సమాచారం. కాతువాకుల రెండు కాదల్ సినిమాలో నటిస్తున్న నయనతార చిరంజీవి చిత్రంలో కథానాయికగా నటించనుంది.