Nayanathara | కోలీవుడ్ స్టార్ నటుడు సూర్య, దిగ్గజ దర్శకుడు మురుగదాస్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం గజిని(). అసిన్‌తో పాటు నయనతార ఇందులో కథానాయికలుగా నటించారు. 2005లో వచ్చిన ఈ చిత్రం సూర్య కెరీర్లోనే ఆల్‌టైం బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అయితే ఈ సినిమాపై తాజాగా హీరోయిన్ నయనతార ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
గజిని సినిమాలో చిత్ర అనే డాక్టర్ పాత్రలో నయన్ నటించింది. అయితే ఈ పాత్ర తన మూవీ కెరీర్లోనే అత్యంత చెత్త ఎంపిక అంటూ వ్యాఖ్యానించింది. తాను ఇప్పటివరకు చేసిన సినిమాలలో గజిని సినిమానే నాకు చెత్త ఎంపిక. ఈ సినిమాలో నటించినందుకు ఇప్పటికి కూడా చింతిస్తుంటాను. ఈ మూవీలో తన పాత్రను మేకర్స్ చెప్పినట్లుగా చిత్రీకరించలేదని, తనను చెత్తగా ఫోటోలు తీశారంటూ తెలిపింది. అయితే ఆ సమయంలో తాను ఇవేమి పట్టించుకోలేదని దాన్ని కెరీర్లో లెర్నింగ్ ప్రాసెస్ అనుకున్నానని వెల్లడించింది.
ఇక నయనతార సినిమాల విషయానికి వస్తే.. గతేడాది జవాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంది. షారుక్- అట్లీ కాంబోలో వచ్చిన ఈ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.