Nayanatara | తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు మొదఅయిన విషయం తెలిసిందే. మూడు రోజుల పాటు జరిగే సంక్రాంతి వేడుకల్లో మొదటి రోజైన భోగి పర్వదినాన్ని తెలుగు ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఇక నేడు సంక్రాంతి కావడంతో ప్రజలతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కుటుంబంతో కలిసి సంక్రాంతి సంబరాల్లో మునిగితేలుతున్న ఫొటోలను షేర్ చేస్తూ పండగ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇదిలావుంటే సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ కోలీవుడ్ నటి నయనతార సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపింది. తమిళ ప్రజలకు తమిళ భాషలో పోంగల్ విషెస్ తెలిపిన నయనతార ‘తెలుగు వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు’ అంటూ తెలుగులో రాసుకోచ్చింది.
இனிய பொங்கல் திருநாள் நல்வாழ்த்துக்கள் 🍚🌾🎋 తెలుగు వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు pic.twitter.com/6EJCgboXll
— Nayanthara✨ (@NayantharaU) January 15, 2024