Nayanthara | కోలీవుడ్ హీరోయిన్ నయనతార తాజాగా నటించిన చిత్రం ‘అన్నపూరణి’ (Annapoorani). నయన్ కెరీర్లో 75వ సినిమాగా వచ్చిన ఈ చిత్రాన్ని నీలేష్ కృష్ణ (Nilesh Krishna) దర్శకత్వం వహించాడు. ఎస్. ఆర్.రవీంద్రన్ సమర్పణలో, నాస్ స్టూడియోస్ -ట్రైడెంట్ ఆర్ట్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. ఇక ఈ సినిమా డిసెంబర్ 01న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. పాజిటివ్ టాక్‌తో ఈ మూవీ ప్రస్తుతం థియేటర్లలో స్క్రీనింగ్ అవుతుంది. అయితే ఈ సినిమా సాధించిన విజయం పట్ల చిత్రబృందం చెన్నైలోని ఓ మహిళా కళాశాలను సందర్శించింది. ఇందులో నయనతారతో పాటు తమిళ నటుడు జై (Jai) కూడా వచ్చి సందడి చేశాడు.
నయనతార, జై (Jai) లు లంచ్ టైమ్‌లో స్టూడెంట్స్‌తో ముచ్చటించి.. వారికి బిర్యానీ వడ్డించారు. ఇక నయనతార, జై లను చూడగానే ఆ స్టూడెంట్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Briyani is even more special when Poorni serves it 🙂 #Annapoorani serving now in cinemas near you.
Enjoy the feast ❤️ pic.twitter.com/pf66rJCymI
— Zee Studios South (@zeestudiossouth) December 3, 2023
ఈ సినిమా కథలోకి వెళితే.. సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన నయనతార ఒక ప్రొఫెషనల్ చెఫ్‌గా మారాలనుకుంటుంది. ఈ క్రమంలో తనకు ఎదురైనా సవాళ్లు ఎంటి.. కుటుంబం నుంచి వచ్చిన ఒత్తిడిని తట్టుకుని దేశంలో బెస్ట్ చెఫ్ గా ఎలా ఎదిగింది అనేది ఈ సినిమా స్టోరీ. ఇక మూవీలో జై, సత్యరాజ్, అచ్యుత్ కుమార్, కెఎస్ రవికుమార్, సురేష్ చక్రవర్తి సహా పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. థమన్ సంగీతం అందించాడు.
మరోవైపు ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 వేదికగా డిసెంబర్ 31 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం అయితే దీనిపై మేకర్స్ ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.