Connect Movie Teaser | దక్షిణాదిన అగ్ర కథానాయికలలో నయనతార ఒకరు. సౌత్‌లోని స్టార్ హీరోలందరితో సినిమాలు చేసి లేడీ సూపర్ స్టార్‌గా ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఈమె పేరే చెప్పుకుంటారు. ఇటీవలే గాడ్‌ఫాదర్‌తో సూపర్ హిట్ విజయాన్ని సాధించిన నయన తార.. ఇప్పుడు కనెక్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. మహిళా ప్రధానంగా సాగే ఈ చిత్రాన్ని అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే చిత్రబృందం రిలీజ్ చేసిన పోస్టర్లు సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు.
లేటెస్ట్గా రిలీజైన టీజర్ ఆద్యాంత ఆసక్తికరంగా సాగింది. హర్రర్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండనున్నట్లు టీజర్ చూస్తే తెలుస్తుంది. ఈ చిత్రాన్ని రౌడీ పిక్చర్స్ పతాకంపై నయన తార భర్త విఘ్నేష్ శివన్ నిర్మించాడు. కాగా ఈ సినిమాను డిసెంబర్ 22న తెలుగులో గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు యూవీ క్రియేషన్స్ సంస్థ సన్నాహాలు చేస్తుంది. మయూరి వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత నయనతార, అశ్విన్ కాంబోలో ఈ సినిమా తెరకెక్కడంతో ప్రేక్షకులలో భారీ అంచనాలే ఉన్నాయి. సత్యరాజ్, అనుపమ్ ఖేర్, వినయ్ రాయ్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి పృథ్వి చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు.
నయన్ ప్రస్తుతం షారుఖ్‌తో జవాన్ సినిమాలో నటిస్తుంది. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రథమార్థంలో రిలీజ్ కానుంది. దీనితో పాటుగా తెలుగులో చిరంజీవితో కలిసి ‘భోళా శంకర్’ సినిమా చేస్తుంది.
.@UV_Creations is proud to present Lady Superstar #Nayanthara’s Breathtaking Horror-Thriller #Connect in Telugu.
Directed by @Ashwin_saravana , Produced by @Rowdy_Pictures @VigneshShivN
Chills down your spine from 22nd December ! 👻 🔥@AnupamPKher #Sathyaraj #VinayRai pic.twitter.com/OCj4zDSfjg
— UV Creations (@UV_Creations) December 5, 2022