Naveen Polishetty | ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తర్వాత నవీన్ పోలిశెట్టి విరామం తీసుకున్నారు. ఆయన చేతికి గాయం కావడమే ఈ విరామానికి కారణం. ఇప్పుడు నవీన్ పూర్తిగా తేరుకున్నారు. సినిమాలు చేయడానికి సన్నద్ధం అవుతున్నారు. తాజాగా గీతా ఆర్ట్స్‌లో ఓ సినిమా చేయడానికి ఆయన పచ్చ జెండా ఊపారని విశ్వసనీయ సమాచారం. ఇటీవల గీతా ఆర్ట్స్2 నుంచి వచ్చిన మంచి హిట్ ‘ఆయ్’. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన అంజి దర్శకత్వంలోనే మరో సినిమా చేస్తామని ‘ఆయ్’ ప్రమోషన్లో నిర్మాత బన్నీ వాసు ప్రకటించారు.
దానికి అనుగుణంగానే నవీన్ పోలిశెట్టి కథానాయకుడిగా అంజి దర్శకత్వంలోనే ఓ సినిమా చేయడానికి బన్నీవాసు పావులు కదుపుతున్నారట. నవీన్ కూడా అంజి దర్శకత్వంలో నటించేందుకు సుముఖంగానే ఉన్నట్టు సమాచారం. అయితే.. నవీన్‌ను మెప్పించే కథను అంజి చెప్పగలిగితే ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కే అవకాశం ఉంది.