Naveen Polishetty | టాలీవుడ్ యువ హీరో నవీన్ పొలిశెట్టికి గాయాలైనట్టు తెలుస్తోంది. ఇవాళ ఉదయం యూఎస్‌లో జరిగిన బైకు ప్రమాదంలో నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) కి గాయాలైనట్టు నేషనల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బైకు అదుపుతప్పి రోడ్డుపై పడిపోవడంతో నవీన్ పొలిశెట్టి చేతికి గాయాలవగా.. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించినట్టు టాక్. డాక్టర్లు చికిత్స చేసిన అనంతరం రెండు నెలల విశ్రాంతి తీసుకోవాలని నవీన్ పొలిశెట్టికి సూచించినట్టు సమాచారం.
ఈ ప్రమాదం షూటింగ్లో జరిగిందా..? లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. అయితే దీనిపై నవీన్ పొలిశెట్టి టీం ఏదైనా క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.
ఏజెంట్ శ్రీనివాస ఆత్రేయ, జాతిరత్నాలు సినిమాలతో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు నవీన్ పొలిశెట్టి. చివరగా గతేడాది సెప్టెంబర్‌లో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాలో మెరిశాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. నవీన్ పొలిశెట్టి కొత్త సినిమా ప్రకటించాల్సి ఉంది. నితేశ్ తివారి డైరెక్షన్లో రాబోత్ను రామాయణ్‌లో కీ రోల్ చేయబోతున్నాడని వార్తలు రాగా..దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.