Naveen Polishetty | ప్రస్తుతం తెలుగు సినిమాలకు జాతీయ స్థాయిలో ఆదరణ లభిస్తుంది. ఇతర రాష్ట్రాల ప్రేక్షకులు కూడా టాలీవుడ్ సినిమాలను చూసేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ యంగ్ హీరోలు తమ తమ సినిమాలపై ఎక్కువ శ్రద్ధను చూపుతున్నారు. ఏదో షూటింగ్‌కు వస్తున్నామా.. వెళ్తున్నామా అని కాకుండా సినిమాలలో తమ టాలెంట్లని ఉపయోగిస్తున్నారు. తాజాగా నవీన్ పొలిశెట్టి కూడా తన సినిమా విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు.
నవీన్ పొలిశెట్టి ప్రస్తుతం యూవీ క్రియేషన్స్ బ్యానర్లో ఓ సినిమా చేస్తున్నాడు. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నవీన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా, స్టాండప్ కామెడీయిన్గా కనిపించనున్నట్లు సమాచారం. ఇక ప్రేక్షకులలో నవీన్‌లో అందరికి నచ్చేది కామెడీ టైమింగ్. ఈ క్రమంలోనే నవీన్ తన వరకు ఎంత వీలైతే అంత వరకు కామెడీని పండించే పనిలో ఉన్నాడట. ఇప్పుడిప్పుడే స్టాండప్ కామెడీ అంటే ఎంటో తెలుగు ప్రేక్షకులకు తెలుస్తుంది. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’లో పూజా హెగ్డే, ‘స్టాండప్ రాహుల్’లో రాజ్ తరుణ్ స్టాండప్ కామెడియన్ పాత్రల్లో నటించి ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయారు.
ఈ క్రమంలో నవీన్ పొలిశెట్టి తన పాత్రపై పూర్తి శ్రద్దను పెట్టి స్టాండప్ కామెడీయన్‌గా తన టైమింగ్ లెవల్‌ను ఇంకా పెంచుకుంటున్నాడట. మహేష్ బాబు.పి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రమోద్, వంశీ నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన నవీన్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు విశేష స్పందన వచ్చింది.