Naveen Polishetty | ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోని టాప్ దర్శకులు, నిర్మాతలు, నటులు ఒక్కసారిగా ఒకే ఫ్రేమ్‌లో కనిపించి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. స్టార్ డైరెక్టర్లు సుకుమార్, ప్రశాంత్ నీల్, లోకేష్ కనగరాజ్, కన్నడ నటుడు దర్శకుడు రిషభ్ శెట్టి, టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు నవీన్ యేర్నేని, రవిశంకర్, దర్శకుడు హరీశ్ శంకర్ అందరూ ఒకేచోట కలిసిన ఫోటోలు ఇప్పటికే నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఈ భారీ కలయికకు సంబంధించి తాజాగా నటుడు నవీన్ పోలిశెట్టి ఒక ఫన్నీ వీడియోను తన సోషల్ మీడియాలో పంచుకుని మరింత క్రేజ్ తెచ్చాడు.
ఆ వీడియోలో నవీన్ సరదాగా మాట్లాడుతూ.. ఈ ఫ్రేమ్ విలువను లెక్కగట్టాడు. లోకేష్ కనగరాజ్ రూ.500 కోట్లు, రిషభ్ శెట్టి రూ.800 కోట్లు, మైత్రీ నిర్మాతలు మరియు సుకుమార్ కలిపి రూ.2000 కోట్లు, ప్రశాంత్ నీల్ రూ.2000 కోట్లు, చివరగా నావీ అంటే తన వాటా రూ.100 కోట్లు అంటూ మొత్తం కలిపి ఇది రూ.5500 కోట్ల ఫ్రేమ్ అని నవీన్ చెప్పుకొచ్చాడు. నవీన్ టైమింగ్, అక్కడున్న స్టార్ డైరెక్టర్ల రియాక్షన్లు వీడియోకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ ఫన్నీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇంతమంది పాన్ ఇండియా దిగ్గజాలు ఒకేచోట కలవడంతో భారీ ప్రాజెక్టుకు రంగం సిద్ధమవుతోందా అనే చర్చ కూడా అభిమానుల్లో మొదలైంది. అయితే ఇది కేవలం స్నేహపూర్వక కలయికేనా లేక ఏదైనా కొత్త సినిమా చర్చల కోసమా అనేది తెలియాల్సి ఉంది.
Pan India reel 😍 #PrashanthNeel @aryasukku @Dir_Lokesh @shetty_rishab . @MythriOfficial here we go. New film loading soon 🔥 Super excited for next year 💪❤️🙏 pic.twitter.com/Zi5lJGS1Wy
— Naveen Polishetty (@NaveenPolishety) June 25, 2026