Naveen Polishetty | తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ప్రస్తుతం సక్సెస్ ఎప్పుడు ఎలా వస్తుందో అంచనా వేయలేని పరిస్థితులున్నాయని తెలిసిందే. స్టార్ హీరో.. భారీ బడ్జెట్ సినిమా అయినా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకుంటుందనేది గ్యారంటీగా చెప్పలేం. ఇలాంటి పరిస్థితుల్లో మోస్ట్ డిపెండెబుల్ యాక్టర్‌గా నిలుస్తూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయాడు నవీన్ పొలిశెట్టి. ఇండస్ట్రీ విలువలకు ఇబ్బంది కలిగించకుండా.. బాక్సాఫీస్ వద్ద బ్యాక్ టు బ్యాక్ సక్సెస్‌లు అందుకుంటున్నాడు.
ఈ మల్టీ టాలెంటెడ్ యాక్టర్ ఖాతాలో అరుదైన ఫీట్ చేరిపోయింది. నాలుగు థ్రియాట్రికల్ హిట్స్‌తో అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతి రత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి, అనగనగా ఒక రాజు.. ఈ నాలుగు చిత్రాలు సాలిడ్ హిట్స్‌గా నిలిచాయి. అనగనగా ఒక రాజు వరల్డ్ వైడ్‌గా రూ.100 కోట్ల గ్రాస్ మార్క్ అధిగమించి.. నవీన్ పొలిశెట్టి కెరీర్లో రూ.100 కోట్ల సాధించిన తొలి సినిమాగా నిలుస్తోంది. ఓవర్సీస్లో ప్రత్యేకించి యూఎస్ మార్కెట్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్తో అదరగొట్టేస్తుంది.
భిన్నమైన నిర్మాణ సంస్థలు, డిఫరెంట్ జోనర్లలో సినిమాలు చేస్తూ ఒకే రకమైన సక్సెస్ నవీన్ పొలిశెట్టిని ఫాలో అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు ఎంతో విశ్వసించే వ్యక్తిగా నిలిచిపోయాడు నవీన్ పొలిశెట్టి. కొన్ని సార్లు ఖర్చు పెరగడం, ప్రేక్షకుల ఊహించని ప్రవర్తన లాంటి విషయాలు చాలా బ్యానర్లను చిక్కుల్లో పడేస్తాయి. నవీన్ పొలిశెట్టి సినిమా మాత్రం వారిలో నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగిస్తాయి. నవీన్ పొలిశెట్టి లీడ్ రోల్ చేస్తున్నాడంటే రిస్క్ తక్కువ.. రిటర్న్ ఎక్కువ అని ఫిక్సయిపోతారు నిర్మాతలు.
మొత్తానికి తనను నమ్ముకున్నమూవీ లవర్స్‌కు మంచి వినోదాన్ని అందిస్తూ.. మరోవైపు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు కాసుల వర్షం కురిపిస్తూ హాట్ టాపిక్‌గా నిలుస్తున్నాడు నవీన్ పొలిశెట్టి.
Anti Biotics | యాంటీ బయోటిక్స్ వాడితే.. పేగుల ఆరోగ్యాన్ని ఇలా రక్షించుకోండి..!
Mirai | టీవీ ప్రీమియర్‌కు సిద్ధమైన బ్లాక్‌బస్టర్ ‘మిరాయ్’… ఈ నెలలోనే స్టార్ మా లో సందడి
Bhadradri Kothagudem : ‘గెలుపు గుర్రాలకే పార్టీ టికెట్లు’