Miss Shetty Mr Polishetty| నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty), అనుష్కా శెట్టి (Anushka shetty) కాంబినేషన్లో వస్తున్న చిత్రం Miss శెట్టి మిస్టర్ Polishetty (Miss Shetty Mr Polishetty). ఇప్పటికే ఈ మూవీ నుంచి లాంఛ్ చేసిన టీజర్, పోస్టర్లతోపాటు నో నో నో, హతవిధి, లేడీ లక్ సాంగ్స్‌కు మంచి స్పందన వస్తోంది. తాజాగా సినిమా విడుదల తేదీని ఫైనల్ చేస్తూ కొత్త లుక్ విడుదల చేశారు మేకర్స్. నవీన్ పొలిశెట్టి, అనుష్కా శెట్టి కృష్ణాష్టమి సెప్టెంబర్ 7న మీపై వెన్న చల్లేందుకు వస్తున్నారు రెడీగా ఉండండి.. అంటూ లాంఛ్ చేసిన లుక్ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.
తాజా లుక్‌లో స్వీటీ సూపర్ స్లిమ్‌గా కనిపిస్తూ.. నాలుగు పదుల వయస్సులోనూ యంగ్ హీరోయిన్లకు గట్టిపోటీనిస్తోంది. ఇప్పటికే లాంఛ్ చేసిన Miss శెట్టి మిస్టర్ Polishetty ఫస్ట్ లుక్‌లో అనుష్క హ్యాపీ సింగిల్ పుస్తకాన్ని చేతిలో పట్టుకొని ఊహల్లో విహరిస్తున్నట్టు కనిపిస్తుండగా.. మరోవైపు నవీన్ పొలిశెట్టి గోడపై కూర్చొని హ్యాపీ మూడ్‌లో ఛిల్ అవుట్ అవుతున్నాడు.
Miss శెట్టి మిస్టర్ Polishetty తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చి సోలో లైఫ్ లీడ్ చేస్తున్న మిస్టర్ పొలిశెట్టి, మిస్ పొలిశెట్టి మధ్య సాగిన ఫన్నీ లవ్ ట్రాక్‌తో సినిమా ఉండబోతున్నట్టు ఇప్పటికే లాంఛ్ చేసిన టీజర్, పాటలతో క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్. సింగిల్స్ గా ఉన్న నవీన్ పొలిశెట్టి, అనుష్క మధ్య ఎలాంటి ట్రాక్ ఉండబోతుందనేది మాత్రం తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
Miss Shetty and Mr. Polishetty are ready to butter you up on Janmashtami! #MissShettyMrPolishetty are all set to entertain you all starting from September 7th in theaters! 🥳#MSMPonSep7th @MsAnushkaShetty @NaveenPolishety @filmymahesh @radhanmusic #NiravShah pic.twitter.com/WZ4lGoKg6a
— UV Creations (@UV_Creations) August 14, 2023
లేడీ లక్ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్..
లేడీ లక్ ప్రోమో..
హథవిది లిరికల్ వీడియో సాంగ్..
నోనోనో లిరికల్ సాంగ్..
Miss శెట్టి మిస్టర్ Polishetty టీజర్..