నవీన్ పోలిశెట్టి, అనుష్క జంటగా నటిస్తున్న సినిమా ‘మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి’. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా దర్శకుడు పి.మహేష్ బాబు తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘హతవిధి..ఏందిది..’ అనే పాటను రిలీజ్ చేశారు. ఈ పాటను తమిళ స్టార్ ధనుష్ పాడటం విశేషం. రధన్ స్వరకల్పనలో రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించారు. ‘హతవిధి..ఏందిది..
ఊహలో లేనిది..బుల్లి చీమ బతుకుపై బుల్డోజరైనది..’అంటూ కథానాయకుడి దురదృష్టాన్ని వర్ణిస్తూ సాగుతుందీ పాట. ఈ చిత్రంలో చెఫ్ అన్విత రవళి పాత్రలో అనుష్క, సిద్ధు పోలిశెట్టి అనే స్టాండప్ కమెడియన్గా నవీన్ పోలిశెట్టి కనిపించనున్నారు. ఈ సినిమా త్వరలో పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.