JO JO Laali | నవీన్ చంద్ర కథానాయకుడిగా నటిస్తున్న సరికొత్త సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ ‘హనీ’ సినిమా నుంచి తాజాగా ‘జో జో లాలి’ అనే పాట విడుదలైంది. అజయ్ అరసాడ సంగీతం అందించిన ఈ పాట ఎంతో హృద్యంగా, భావోద్వేగభరితంగా సాగుతూ శ్రోతలను ఆకట్టుకుంటోంది. ‘పలాస 1978’, ‘శ్రీదేవి సోడా సెంటర్’ వంటి చిత్రాలతో తనదైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు కరుణ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మనుషుల మనస్తత్వాలు మరియు మూఢనమ్మకాల నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో దివ్య పిళ్లై, దివి వద్త్యా, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు విశేష స్పందన లభించగా, ఈ మెలోడీ సాంగ్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచింది. OVA ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 6, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.