నవీన్చంద్ర, గాయత్రి సురేష్ జంటగా నటిస్తున్న చిత్రం ‘నేను లేని నా ప్రేమకథ’. సురేష్ ఉత్తరాది దర్శకుడు. కల్యాణ్ కందుకూరి, ఏ భాస్కరరావు నిర్మిస్తున్నారు. అక్టోబర్ 8న ఈ చిత్రం విడుదలకానుంది. నిర్మాతలు మాట్లాడుతూ ‘సంగీతభరిత ప్రేమకథా చిత్రమిది. రాధ అనే అమ్మాయి, కృష్ణ అనే అబ్బాయి ఎలా ప్రేమలో పడ్డారు? వారి ప్రణయానికి ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయన్నది ఆసక్తికరంగా ఉంటుంది. వినూత్న కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది’ అని తెలిపారు. క్రిష్ సిద్దిపల్లి, అదితి మ్యాకల్, రాజరవీంద్ర నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జువెన్సింగ్.