నవీన్చంద్ర హీరోగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘లెవెన్’. లోకేష్ అజ్ల్స్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏఆర్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అజ్మల్ఖాన్, రేయాహరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 16న విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం రిలీజ్ డేట్ పోస్టర్ను విడుదల చేశారు.
ఈ సినిమాలో నవీచంద్ర వపర్ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో కనిపిస్తారని, ఓ కేసు శోధనలో ఆయనకు ఎదురైన సవాళ్లు, వాటిని అధిగమించి లక్ష్యాన్ని చేరుకున్న తీరు ఆద్యంతం ఉత్కంఠను పంచుతుందని, స్క్రీన్ప్లే ప్రధానంగా ఆకట్టుకునే చిత్రమిదని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి డి.ఇమ్మాన్ సంగీతాన్నందించారు.