Honey Teaser | నవీన్ చంద్ర కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘హనీ’. ఈ సినిమాకు కరుణకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. OVA ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.
టీజర్ చూస్తుంటే.. ఈ చిత్రం నిజ జీవిత సంఘటనల ఆధారంగా, సమాజంలోని మూఢనమ్మకాలు మరియు అంధ విశ్వాసాల నేపథ్యంలో రూపొందింది. సాధారణ హారర్ సినిమాలకు భిన్నంగా, కేవలం భయపెట్టడమే కాకుండా ఒక మార్మిక ప్రపంచాన్ని ఈ టీజర్లో ఆవిష్కరించారు. చీకటి, నిశ్శబ్దం, మర్మమైన శక్తుల కలయికతో దర్శకుడు కరుణ కుమార్ వెన్నులో వణుకు పుట్టించే విజువల్స్‌ను వెండితెరపైకి తీసుకొస్తున్నారు. ప్రధాన పాత్రలో నవీన్ చంద్ర నటన, దివ్య పిళ్లై, దివి, రాజా రవీంద్రల గూఢమైన పాత్రలు సినిమాపై మరింత ఆసక్తిని కలిగిస్తున్నాయి. అజయ్ అరసాడ అందించిన నేపథ్య సంగీతం టీజర్‌కు ప్రధాన బలమని చెప్పవచ్చు. నాగేష్ బానెల్ సినిమాటోగ్రఫీ, మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్ ఈ చిత్రానికి సాంకేతిక హంగులను జోడించాయి. సైకలాజికల్ డెప్త్ మరియు సోషల్ రిలవెన్స్ ఉన్న ఈ ‘హనీ’ చిత్రం ఫిబ్రవరి 6న థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించనుంది.