నవీన్‌చంద్ర కథానాయకుడిగా నటిస్తున్న సైకలాజికల్ హారర్ మూవీ ‘హనీ’. కరుణకుమార్ దర్శకుడు. ఓవీఏ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 6న విడుదల కానుంది. నిజ జీవిత సంఘటనల ప్రేరణతో మూఢనమ్మకాలు, అంధ విశ్వాసాలు, డార్క్ సైకలాజికల్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. బుధవారం టీజర్‌ను విడుదల చేశారు.
తాంత్రిక పూజలు, కొందరు వ్యక్తులు కలిసి అటవీ ప్రాంతంలో చేసే అన్వేషణ నేపథ్యంలో టీజర్ ఆసక్తికరంగా సాగింది. నవీన్‌చంద్ర గెటప్, హావభావాలు భయపెట్టేలా ఉన్నాయి. హారర్‌తో పాటు ఓ మార్మిక ప్రపంచం నేపథ్యంలో ఈ కథ ఉత్కంఠను పంచుతుందని మేకర్స్ తెలిపారు. దివ్య పిైళ్లె, రాజా రవీంద్ర, జయన్ని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అజయ్ అరసాడ, రచన-దర్శకత్వం: కరుణకుమార్.