వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్‌చంద్ర, సాయికృష్ణ, రాగిణి ద్వివేది ప్రధాన పాత్రధారులుగా రూపొందిన హారర్, యాక్షన్ థ్రిల్లర్ ‘పోలీస్ కైంప్లెంట్’. సంజీవ్ మాగోటి దర్శకుడు. బాలకృష్ణ మహారాణా నిర్మాత. శుక్రవారం సినిమా విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో శనివారం సక్సెస్‌మీట్‌ని నిర్వహించారు.
నిర్మాతమండలి కార్యదర్శి టి.ప్రసన్నకుమార్ ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసి చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. సినిమాకు మంచి స్పందన లభిస్తున్నదని, దర్శకుడిగా ఈ సినిమా తనకెంతో ప్రత్యేకమని, సమిష్టి కృషి వల్లే ఈ విజయమని దర్శకుడు సంజీవ్ మేగోటి అన్నారు. ఇంకా హీరో కృష్ణసాయి, నటులు జెమినీ సురేశ్, విజయభాస్కర్, నిర్మాత ఘంటా శ్రీనివాస్, పంపిణీదారుడు రాఘవేంద్రరెడ్డి కూడా మాట్లాడారు.