Love Mouli | టాలీవుడ్ యాక్టర్ నవదీప్ (Navdeep) లీడ్ రోల్లో నటించిన చిత్రం లవ్ మౌళి (Love mouli). అవనీంద్ర దర్శకత్వం వహించాడు. నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్, సి స్పేస్ సంయుక్తంగా తెరకెక్కించిన ఈ చిత్రం జూన్ 7న ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం థియేటర్లలో ఆశించిన స్థాయిలో టాక్ తెచ్చుకోలేకపోయింది.
లవ్‌మౌళి ఇక ఓటీటీలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయింది. పాపులర్ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహా లవ్‌మౌళి డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను దక్కించుకుంది. అయితే స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడనేది మాత్రం వెల్లడించలేదు. మరి ఓటీటీలోనైనా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందేమో చూడాలంటున్నారు సినీ జనాలు. ఈ చిత్రంలో పంఖురి గిద్వాని ఫీ మేల్ లీడ్ రోల్లో నటించగా.. రానా దగ్గుబాటి అతిథి పాత్రలో మెరిశాడు. గోవింద్ వసంత సంగీతం అందించారు.
He will make you think hard about LOVE ♥️
Experience the journey of #LoveMouli COMING SOON on #Aha.@pnavdeep26 @pankhurigidwan1 #GovindVasantha @IananthaSriram #AnishKrishnan @cspaceg @NyraCreations @thaikudambridge pic.twitter.com/n8BkgDEEzS— ahavideoin (@ahavideoIN) June 19, 2024