Actor Nani | టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని (Nani) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘హాయ్ నాన్న’ (Hi Nanna). నాని 30 (Nani 30)గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు శౌర్యువ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా డిసెంబరు 7న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.
అయితే విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్‌లో భాగంగా సోమవారం తిరుపతి వెళ్లిన ‘హాయ్ నాన్న టీమ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు నానికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గర్భాలయంలో స్వామివారిని ఆయన దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆయనకు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
Natural Star @NameIsNani and the team of #HiNanna visited Tirumala for darshan, offered special prayers ahead of the release. ✨#HiNannaOnDec7th#HiPapaOnDec7th #HiPapa @Mrunal0801 @shouryuv #BabyKiara @HeshamAWMusic @SJVarughese @artkolla @mohan8998 @drteegala9 @VyraEnts… pic.twitter.com/W1kTvsSi9d
— Vyra Entertainments (@VyraEnts) December 4, 2023
ఇక ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తున్న ‘హాయ్ నాన్న’ మూవీలో టాలీవుడ్ భామ సీతారామం ఫేం మృణాళ్ థాకూర్ హీరోయిన్గా నటిస్తోండగా.. మలయాళ నటుడు జయరాం కీలక పాత్ర పోషిస్తున్నారు.
అంతకుముందు ప్రమోషన్స్‌లో భాగంగా ఆదివారం కడప వెళ్లిన నాని అక్కడ ప్రసిద్ధిగాంచిన పెద్ద దర్గా (Kadapa Dargha) ను సందర్శించారు. ఈ సందర్భంగా దర్గా నిర్వాహకులు ఆయనకు సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.