70th National film Awards – Telugu | 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఈసారి తెలుగు సినిమాలకు నిరాశే ఎదురైన విషయం తెలిసిందే. గతేడాది పురస్కారాల్లో ‘ఆర్ఆర్ఆర్’ ‘పుష్ప’ చిత్రాలు సత్తా చాటితే ఈసారి మాత్రం తెలుగు కేటగిరిలో తప్ప ఒక్క అవార్డు గెలవకపోవడం నిరాశ కలిగించే విషయం అని చెప్పుకోవచ్చు.
2023 అవార్డుల్లో ‘ఆర్ఆర్ఆర్’ ఆరు అవార్డులతో, పుష్ప చిత్రం రెండు పురస్కారాలతో జాతీయ స్థాయిలో సత్తా చాటాయి. పుష్ప సినిమాకు గాను ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ అవార్డు గెలుచుకుని తెలుగు వెండితెర 68 ఏళ్ల కలను సాకరం చేశాడు. ఇవే కాకుండా కొండపొలం, ఉప్పెన సినిమాలు కూడా అవార్డులను అందుకున్నాయి.
అయితే ఈసారి కూడా తెలుగు సినిమాలకు అవార్డులు వస్తాయని అందరు భావించారు. ముఖ్యంగా 2022లో విడుదలైన తెలంగాణ నేపథ్యంలో వచ్చిన బలగంతో పాటు విరాట పర్వం, మేజర్, సీతారామం, డీజే టిల్లు, చిత్రాలకు అవార్డులు వస్తాయని ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు భావించారు. అయితే వీరి ఆశలను ఆవిరి చేస్తూ తెలుగు నుంచి ఒక్క చిత్రం మాత్రమే నేషనల్ అవార్డు గెలుచుకుంది.