National Cinema Day | మల్టీప్లెక్స్ ఆసోసియేషన్ ఆఫ్ ఇండియా (MIA) ప్రతి సంవత్సరం అక్టోబర్ 13న ‘జాతీయ సినిమా దినోత్సవం’ నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఈ సంవత్సరం కూడా జాతీయ సినిమా దినోత్సవం సందర్భంగా కేవలం రూ.99కే మల్టీప్లెక్స్‌లో సినిమా చూసే అవకాశం కల్పించింది.
అయితే శుక్రవారం (అక్టోబర్ 13) దేశవ్యాప్తంగా ఉన్న PVR, Inox, Cinepolis, Mirage, CityPride, Asian, MovieTine వంటి మల్టీప్లెక్స్ థియేటర్లలో కేవలం రూ.99లకే సినిమా చూసే అవకాశాన్ని ప్రకటించగా.. ఈ ఒక్క రోజే దాదాపుగా 6 మిలియన్స్‌కు పైగా ఆడియెన్స్ మల్లీప్లెక్స్‌లలో సినిమాలు చూశారు. ఈ విషయాన్ని మల్టీప్లెక్స్ ఆసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.
#NationalCinemaDay A MASSIVE SUCCESS… DRAWS 6 MILLION MOVIEGOERS TO CINEMAS… OFFICIAL STATEMENT… pic.twitter.com/LgM13yi6Ff
— taran adarsh (@taran_adarsh) October 14, 2023
మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తన వ్యాపారాన్ని నిలబెట్టిన సినీ ప్రేక్షకుల కోసం రూ.99 రూపాయిలకే సినిమాను చూపించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ఆఫర్ అక్టోబర్ 13 ఒక్కరోజు మాత్రమే ఉంటుంది. ఇక గతేడాది (2022) కూడా ఇలాగే నేషనల్ సినిమా డే అని కేవలం రూ.75లకే మల్టీప్లెక్స్‌లో సినిమా చూసే చాన్స్ కల్పించారు. కాగా ఆ ఒక్క రోజే దాదాపుగా 6.5 మిలియన్స్‌కు పైగా ఆడియెన్స్ మల్లీప్లెక్స్‌లలో సినిమాలు చూశారు. తొలి ప్రయత్నం విజయం కావడంతో.. రెండో సారి రూ.24 పెంచి రూ.99లకు సినిమా చూసే అవకాశం కల్పించారు.