బిగ్ బాస్ సీజన్ 5 షోలోకి తన భార్య గర్భవతితో ఉన్నా కూడా వచ్చి అలరించిన కంటెస్టెంట్ నటరాజ్ మాస్టర్. తాజాగా ఆయన ఎలిమినేట్ కాగా, అతను హౌజ్ నుండి వెళ్లిపోవడంతో లోబో, యానీ, హమీదా గుక్కపెట్టి ఏడ్చేశారు. నటరాజ్ మాస్టర్ కూడా చాలా ఎమోషనల్ అవుతూ హౌజ్‌ని వీడాడు. అనంతరం స్టేజీ మీదకు వచ్చిన నటరాజ్ బిగ్‌బాస్ హౌస్‌లో తన జర్నీ చూసుకుని భావోద్వేగానికి లోనయ్యాడు.
నా భార్యకు నా అవసరం ఉందేమో, అందుకే దేవుడు నన్ను తన దగ్గరకు పంపిస్తున్నాడని చెప్పుకొచ్చాడు.ఇక నటరాజ్ మాస్టర్‌కు జంతువులు అంటే ఎక్కువ ఇష్టమని, కంటెస్టెంట్లను జంతువులతో పోల్చమని టాస్క్ ఇచ్చాడు. అలా కొన్ని జంతువుల పేర్లు ఉన్న బోర్డును తెప్పించాడు. సిరి పాములాంటిదని, తన జోలికి వస్తేనే కాటు వేస్తుంది.. లేదంటే తన పని తాను చేసుకుంటుందని చెప్పుకొచ్చాడు.
లోబో ఎలుకలా మొత్తం తినేస్తాడని అన్నాడు. విశ్వ ఊసరవెల్లి, శ్రీరామచంద్ర మొసలిలాంటి వాడని, ప్రియాంక సింగ్.. అందరికీ ప్రేమతో వడ్డించే చిలక అని చెప్పుకొచ్చాడు. సింహం.. తానేనన్న నటరాజ్.. మానస్ గాడిదలా ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాడనితెలిపాడు.ఇక గుంటనక్క ఎవరో చెప్పుకుండా, విషయాన్ని దాచిన రవి ఆ విషయాన్ని బయటపెట్టేశాడు. అందరికంటే ఎక్కువ తెలివి ఉంటుందని, కానీ అందరి విషయాల్లో తొంగి చూస్తాడు అని నటరాజ్ మాస్టర్ చెప్పేశారు.
గేమ్ చివరలో నాగార్జున శనివారం వేసుకున్న టీ షర్ట్ బాగుందని, అది తనకు కావాలని హమీదా చెప్పడంతో ఇచ్చేస్తానని చెప్పి బిగ్ బాస్‌కు బై బై చెప్పాడు నాగార్జున.