కొరియోగ్రాఫర్‌గా తన ప్రస్థానం మొదలు పెట్టిన నటరాజ్ మాస్టర్.. బిగ్ బాస్ షోతో మంచి ఆదరణ తెచ్చుకున్నాడు. సీజన్ 5లో పాల్గొన్న ఆయన ఉన్న నాలుగు వారాలు తెగ సందడి చేశాడు. అయితే తన భార్య ఏడు నెలల గర్బిణిగా ఉన్నప్పుడు బిగ్‌బాస్ హౌస్‌లోకి ఆయన ఎంట్రీ ఇచ్చాడు. అయితే నాలుగోవారం ఆయనకు ఓట్లు తక్కువగా రావడంతో బయటకు వచ్చేశాడు. అయినప్పటికీ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.
ఆహా షోలో బాలకృష్ణకు కొరియోగ్రఫీ అందించి అందరి దృష్టిని ఆకర్షించాడు నటరాజ్ మాస్టర్. అయితే అతను కోరుకున్నట్లే ఆడపిల్ల పుట్టింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ నటరాజ్ ఎమోషనల్ అయ్యాడు. తనకు అమ్మాయియే కావాలని కోరుకున్నానని, అనుకున్నట్లే పాప పుట్టిందని మురిసిపోయాడు. బుధవారం అర్థరాత్రి లోబోతో కలిసి ఇన్‌స్టా లైవ్‌లోకి వచ్చిన నటరాజ్.. అభిమానులకు థ్యాంక్స్ చెప్పారు.
అమ్మాయి పుట్టాలని నేను కోరుకున్నాను.. అబ్బాయి పుట్టాలని మా ఆవిడ కోరుకుంది.. ఎవరు పుట్టినా మాకు ఓకే అంటూ నటరాజ్ మాస్టర్ అన్నాడు. అయితే నటరాజ్ మాస్టర్ కోరిక మేరకు ఆడపిల్లే పుట్టింది. ఇక దీంతో నటరాజ్ మాస్టర్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.ఈ విషయాన్ని తనను అభిమానించేవాళ్లందరికీ చెప్పాలనే ఉద్దేశ్యంతో హాస్పిటల్ నుంచే లైవ్‌లోకి వచ్చాడు నటరాజ్ మాస్టర్. హాస్పిటల్లో తన భార్యను, తన బంధువులను అందరినీ చూపించాడు. ఇది మంచి రోజు అని తెలియజేశాడు.