Diljit Dosanjh Sardaar Ji 3 | పంజాబీ గాయకుడు దిల్జిత్ దోసాంజ్‌కు బాలీవుడ్ దిగ్గజ నటుడు నసీరుద్దీన్ షా మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. దిల్జిత్ దోసాంజ్ తన అప్‌కమింగ్ చిత్రం సర్దార్ జీ 3 (Sardaar Ji 3)లో పాకిస్థాన్ నటి హానియా అమీర్‌తో కలిసి నటించడంపై చిత్ర పరిశ్రమలోని కొన్ని వర్గాలు విమర్శలు గుప్పించాయి. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తానీ నటులపై ఉన్న నిషేధాన్ని ఉల్లంఘిస్తూ దిల్జిత్ నటించారని ఆరోపణలు వచ్చాయి. ఈ వివాదం నేపథ్యంలోనే నసీరుద్దీన్ షా దిల్జిత్‌కు మద్దతుగా నిలుస్తూ ఫేస్బుక్ వేదికగా ఒక పోస్ట్ పెట్టాడు. అయితే ఈ పోస్ట్‌ను కాసేపటికే నసీరుద్దీన్ షా డిలీట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై తాజాగా క్లారిటీ ఇచ్చాడు నసీరుద్దీన్ షా.
ఈ విషయంపై నసీరుద్దీన్ షా మాట్లాడుతూ, తాను ఆ పోస్ట్‌ను తొలగించలేదని, ఫేస్బుక్ నుంచే అది తీసివేయబడిందని పేర్కొన్నారు. “నా పోస్ట్‌ను నేను డిలీట్ చేయలేదు. నేను చెప్పదలచుకున్నది చెప్పాను, దానికి కట్టుబడి ఉన్నాను” అని ఆయన అన్నారు. సినిమా పరిశ్రమ నుంచి తనకు మద్దతు లభించకపోయినా తాను నిరుత్సాహపడలేదని కూడా తెలిపారు.